Chandra Bose : అక్షరాల ఆకాశంలో ‘చంద్ర’మామ
ABN , First Publish Date - 2023-03-14T03:45:20+05:30 IST
సంగీత, సాహిత్యాలతో పరిచయం లేని కుటుంబంలో జన్మించారు చంద్రబోస్. వరంగల్ జిల్లాలోని చెల్లగరిగె ఆయన స్వగ్రామం. తండ్రి నరసయ్య ఉపాధ్యాయుడు
సంగీత, సాహిత్యాలతో పరిచయం లేని కుటుంబంలో జన్మించారు చంద్రబోస్. వరంగల్ జిల్లాలోని చెల్లగరిగె ఆయన స్వగ్రామం. తండ్రి నరసయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. నలుగురు పిల్లలను సాకేందుకు ఆ తల్లి దండ్రులు పడిన కష్టం బాల్యంలోనే చంద్రబో్‌సకు శ్రమ విలువ తెలిసేలా చేసింది. చదువు కొనసాగిస్తూనే సినిమా అవకాశాల కోసం ఆయన ప్రయత్నించారు. అయితే మొదట్లో పాటల రచయితగా గాక నేపథ్య గాయకుడిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో స్నేహితుడు శ్రీనాథ్ పాటల రచయితగా ప్రయత్నించమని సలహా ఇవ్వడం చంద్రబోస్ జీవితాన్ని మలుపు తిప్పింది. వేటూరి, సీతారామశాస్త్రిలాంటి ఉద్ధండులు రంగంలో ఉండడంతో చంద్రబోస్‌కు అవకాశాలు అంత సులభంగా రాలేదు. 1995లో ‘తాజ్‌మహల్’ చిత్రం గీత రచయితగా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా ‘మంచుకొండల్లోని చంద్రమా’ పాట తెలుగునాట మార్మోగిపోయింది. అంతే తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ఎదుగుదలకు బాటగా మార్చుకున్నారు. ఇన్నేళ్లలో ఎన్నో గుర్తుండిపోయే పాటలు ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.