Chief Minister: హైవేల అభివృద్ధికి రూ.3,579 కోట్లు
ABN , First Publish Date - 2023-02-15T11:14:59+05:30 IST
రాష్ట్రంలో ఆరు చోట్ల హైవేల అభివృద్ధికి కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి
బెంగళూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరు చోట్ల హైవేల అభివృద్ధికి కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో ఆరుచోట్ల రూ.3,579 కోట్ల అంచనా ఖర్చుతో ఈ హైవేలను అభివృద్ధి చేస్తామన్నారు. మహారాష్ట్ర - కర్ణాటక సరిహద్దులోని హైవే 166 ఇ వద్ద కనమడి - బిజ్జోడి - తికోట ద్విపథ రహదారిని రూ.196.05 కోట్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులోని హైవే 548 బి వద్ద మురుం నుంచి ఐబీ సర్కిల్ వరకు రూ.957 కోట్ల ఖర్చుతో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ రెండు హైవేల విస్తరణ కారణంగా కలబురగి, విజయపుర జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కొప్పళ, గదగ్ జిల్లాల మీదుగా సాగే హైవే 367 వద్ద ఖానాపుర - గద్దనకేరి విభాగంలోనూ, కుకనూరు, యలబుర్గ, గజేంద్రఘడ ప్రాంతాల్లో బైపా్‌సలను రూ.333.96 కోట్లతో నిర్మిస్తామన్నారు. ఇక హావేరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో హుణచగేరి నుంచి కొడగానూర, పుర్తగేరి, రాజూర బైపాస్ నిర్మాణానికి రూ.130కోట్లు ఖర్చు చేయనున్నారు. బాగల్కోట జిల్లా పరిధిలోకి వచ్చే హైవే 367లో సర్జాపుర నుంచి పట్టణకల్లు వరకు రూ.445.52కోట్ల ఖర్చుతో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. మైసూరు, కుశాలనగర్ ప్రాంతంలో హైవే 275 ను రూ.909.86 కోట్ల ఖర్చుతో చతుష్పథ రహదారి మార్గం బైపాస్ నిర్మించనున్నారు. ఇళవాళ - కేఆర్‌నగర్ జంక్షన్‌లో బైపాస్ రోడ్డుతోపాటు రహదారి విస్తరణ పనులను రూ. 739.39 కోట్ల ఖర్చుతో చేపట్టనున్నారు.
ఇదికూడా చదవండి: ప్రభాకరన్ బతికే ఉన్నాడన్న ఈ పెద్దాయన పరిస్థితి ఇప్పుడేంటంటే..