Home » Bengaluru
తక్కువ ఖర్చుతో కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులో 35 చెరువులను అభివృద్ధి చేసింది. చెరువుల పరిరక్షణకు, తీసుకుంటున్న చర్యలపై.. హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పర్యటిస్తున్నారు. పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత సిటీలో మొదటి దశలో నాలుగు చెరువుల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టనున్నారు.
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కారు ఆపమంటే.. ఆపలేదని ఓ వ్యక్తి ఆగ్రహించాడు. ఆ కారును వెండించాడు. అనంతరం కారుకు అడ్డంగా బైక్ నిలిపాడు. ఆ తర్వాత కారు కిటికి అద్దాలను పగల కొట్టాడు. ఈ ఘటనలో కారులోని బాలుడి తలకు తీవ్ర గాయమైంది.
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. దీంతో కర్ణాటక ఓటరు... కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. పార్టీ మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సిద్దరామయ్య ప్రభుత్వం అమలు చేసింది.
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ 3 దంపతులు బెంగళూరు విచ్చేశారు. అక్టోబర్ 26 నుంచి 30 వరకు వారు బెంగళూరులోనే ఉన్నారు. అయితే వీరి పర్యటన చాలా టాప్ సీక్రెట్‌గా జరిగింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను వెలువరించింది.
బెంగళూరులోని ఐటీ హబ్‌కు వెళ్లే వారికి ఈ మార్గం ప్రధాన మార్గం కావడంతో.. అందరు ఇటుగానే ప్రయాణిస్తున్నారు. దాంతో వాహనదారులు గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చక్కబడే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తమిళనాడులోని హోసూరులో గత 24 గంటలుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని రిజర్వాయర్లు నీటితో నిండిపోయాయి. ఆ నీటికి కిందకి వదిలారు. ఆ క్రమంలో హోసూరు రహదారిపైకి భారీగా విషపూరితమైన నురగ వచ్చి చేరింది. దాదాపు 5 అడుగుల మేర ఈ నురుగ ఏర్పడింది. దీంతో వాహనాలను మరో మార్గంలో మళ్లిస్తున్నారు.
నగరంలో నీట మునిగిన ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బుధవారం సాయంత్రం నగరమంతటా వర్షం కురిసింది. యలహంక(Yalahanka) పరిధిలోని కేంద్రీయవిహార్ అపార్ట్మెంట్ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను డీసీఎం డీకే శివకుమార్ పరిశీలించారు.
తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదనీటితో ముంచెత్తాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బెంగళూరులో వర్షాల దాటికి నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 10 నుంచి 12 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులు పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం తెలియరాలేదు.
ఎలహంకలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీఎస్) బస్సు, పలు వాహనాల ఇంజన్ల లోకి నీళ్లు చేరడంతో ఎలహంక ఓల్డ్ టౌన్ రోడ్డుపైనే అవి నిలిచిపోయాయి. క్రేన్లను రంగంలోకి దింపిన అధికారులు రోడ్లపైన నిలిచిపోయిన వాహనాలను తొలగించే చర్యలు చేపట్టారు.