Red Alert: ఉత్తర భారతావనిని వణికిస్తున్న చలిగాలులు...ఐఎండీ రెడ్ అలర్ట్
ABN , First Publish Date - 2023-01-10T09:36:04+05:30 IST
ఉత్తర భారతదేశంలో మంగళవారం తీవ్ర చలిగాలులు వీస్తుండటంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది...
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో మంగళవారం తీవ్ర చలిగాలులు వీస్తుండటంతో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.(Cold wave) ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం దట్టమైన పొగమంచు(fog) కమ్ముకుంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో(North India) చలిగాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.చలి గాలులు బీహార్‌ను తాకడంతో గయ నగరంలో మంగళవారం ఉష్ణోగ్రత 3.7డిగ్రీల సెల్షియస్ కు తగ్గింది. చలి గాలుల ప్రభావం వల్ల రాబోయే 72 గంటలపాటు బీహార్ రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.
పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్,ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్‌తో సహా పలు ప్రదేశాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో తీవ్ర పొగమంచు కారణంగా రెడ్ అలర్ట్ (Red Alert)ప్రకటించారు.పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో 36 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.