Share News

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రండి

ABN , Publish Date - Dec 20 , 2023 | 05:06 AM

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్‌ నేతలు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ(96), మురళీ మనోహర్‌ జోషి(89)లను ఆహ్వానించినట్లు విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) మంగళవారం తెలిపింది.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రండి

ఆడ్వాణీ, జోషిలకు వీహెచ్‌పీ ఆహ్వానం

న్యూఢిల్లీ, డిసెంబరు 19: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ సీనియర్‌ నేతలు లాల్‌ కృష్ణ ఆడ్వాణీ(96), మురళీ మనోహర్‌ జోషి(89)లను ఆహ్వానించినట్లు విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) మంగళవారం తెలిపింది. వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని రామాలయ ప్రారంభోత్సవానికి రావొద్దని విజ్ఞప్తి చేశామని, వారు అందుకు అంగీకరించారని సోమవారం రామ మందిర ట్రస్ట్‌ తెలిపింది. రామ మందిరం కోసం చేసిన ఉద్యమంలో ముందున్న ఆడ్వాణీ, జోషిలను ప్రారంభోత్సవానికి రావొద్దని ట్రస్టు అభ్యర్థించడంపై దుమారం రేగింది. అనుభవజ్ఞులయిన నాయకులను బీజేపీ పక్కన పెట్టిందని, వారిని అవమానించిందని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘‘సీనియర్‌ నాయకులు ఇద్దరినీ కార్యక్రమానికి ఆహ్వానించాము. రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని వారు తెలిపారు’’ అని వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ వెల్లడించారు.

Updated Date - Dec 20 , 2023 | 06:40 AM