Fire breaks out: కన్నాట్ ప్లేస్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-07-15T20:30:04+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌ లో ఉన్న డీసీఎం భవంతిలో భారీ అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. భవంతిలోని 9వ అంతస్తులో శనివారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో చుట్టపక్కలంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పదికి పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

Fire breaks out: కన్నాట్ ప్లేస్‌లో భారీ అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌ (Connaught Place)లో ఉన్న డీసీఎం భవంతిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చేటుచేసుకుంది. భవంతిలోని 9వ అంతస్తులో శనివారం సాయంత్రం 6.20 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో చుట్టపక్కలంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పదికి పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదంతో బారకాంబ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలివేశారు. కాగా, ఈ ప్రమాదానికి కారణాలు, ఆస్తినష్టం, ప్రాణనష్టంపై వివరాలు వెంటనే తెలియలేదు.


దేశరాజధానిలో యమునా జలాల ఉధృతి కారణంగా జనజీవనం ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రాజధానిలోని కీలక ప్రాంతమైన కన్నాట్ ప్లేస్‌లో అగ్నిప్రమాదం జరగడంతో జనం ఒక్కసారిగా బెంబేలెత్తారు. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భందంలో ఉండగా, ఆరుగురు మంత్రులు సహాయ కార్యక్రమాల పర్వేక్షణలో తలమునకలవుతున్నారు. 20 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Updated Date - 2023-07-15T20:30:04+05:30 IST