INDIA name: ఇండియా పేరు వినియోగంపై 26 పార్టీలపై పోలీసు కేసు నమోదు

ABN , First Publish Date - 2023-07-19T20:24:40+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోటీకి 26 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన విపక్ష కూటమి పేరుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విపక్ష ఫ్రంట్‌కు జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అనే పేరు పెట్టారు. అయితే INDIA పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది

INDIA name: ఇండియా పేరు వినియోగంపై 26 పార్టీలపై పోలీసు కేసు నమోదు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేపై పోటీకి 26 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన విపక్ష కూటమి పేరుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విపక్ష ఫ్రంట్‌కు జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A.) అనే పేరు పెట్టారు. అయితే INDIA పేరును ఉపయోగించుకోవడం సరికాదని, ఇది అక్రమ వినియోగం కిందకు వస్తుందని పేర్కొంటూ ఢిల్లీలోని బారాఖమ్బ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. డాక్టర్ అవినాష్ మిశ్రా అనే 26 ఏళ్ల యువకుడు ఈ ఫిర్యాదు చేశాడు.


జాతీయ చిహ్నాల చట్టం (Emblems Act) కింద 'INDIA' అనే పేరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరూ ఉపయోగించుకోరాదని ఫిర్యాదుదారు తన కంప్లయింట్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. 26 రాజకీయ పార్టీలు దేశం పేరును దుర్వినియోగం చేశాయని ఆయన ఫిర్యాదు చేశారు.


ఎన్డీయే వర్సెస్ ఇండియాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో బెంగళూరులో సోమ, మంగళవారంలో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ పేరుపై చర్చ జరిపారు. అందరి నుంచి సమ్మతి పొందిన తర్వాత దీనిని అధికారికంగా ప్రకటించారు.

Updated Date - 2023-07-19T20:24:40+05:30 IST