Independence Day 2023: పారా గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లపై నిషేధం
ABN , First Publish Date - 2023-07-21T18:59:49+05:30 IST
ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీ పోలీసులు నిషేధ ఉత్తర్వులు విడుదల చేశారు. పారా-గ్లైడర్లు, పారా-మోటర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, యూఏవీలు, యూఏఎస్ఎస్‌లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, స్మాల్ సైజ్డ్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాజంపింగ్‌లను రాజధాని గగనతలంలో ఎగురకుండా నిషేధాజ్ఞలు విధించారు.
న్యూఢిల్లీ: ఇండిపెండెన్స్ డే (Independence Day 2023) వేడుకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీ పోలీసులు నిషేధ ఉత్తర్వులు విడుదల చేశారు. పారా-గ్లైడర్లు, పారా-మోటర్లు, హ్యాంగ్ గ్లైడర్లు, యూఏవీలు, యూఏఎస్ఎస్‌లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్, రిమోట్ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్లు, స్మాల్ సైజ్డ్ పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, పారాజంపింగ్‌లను రాజధాని గగనతలంలో ఎగురకుండా నిషేధాజ్ఞలు విధించారు. జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. స్వాతంత్ర్య వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా (Sanjay Arora) ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేరగాళ్లు, సంఘ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టుల నుంచి ప్రజలు, ముఖ్య అతిథులు, కీలకమైన కట్టడాల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు సంజయ్ అరోరా తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 188 కింద శిక్షార్హులవుతారని ఆయన ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.