Shraddha murder case: అఫ్తాబ్‌కు వెచ్చని దుస్తులివ్వండి...జైలు అధికారులకు కోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2023-01-10T12:06:02+05:30 IST

శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని...

Shraddha murder case: అఫ్తాబ్‌కు వెచ్చని దుస్తులివ్వండి...జైలు అధికారులకు కోర్టు ఆదేశం
Aftab Poonawala

న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు(Delhi Saket court) మరో 14 రోజులు పొడిగించింది. (Extends Judicial Custody)తాను చదువుకోవడానికి లా పుస్తకాలు, తీవ్ర చలి ఉన్నందున వెచ్చని దుస్తులు కావాలని ఆఫ్తాబ్ (Aftab Poonawala)కోర్టు జడ్జీని డిమాండ్ చేశారు. దీంతో నిందితుడు ఆఫ్తాబ్ కు వెచ్చని దుస్తులు అందించాలని సాకేత్ కోర్టు జడ్జి అధికారులను ఆదేశించారు. నిందితుడు ఆఫ్తాబ్ శ్రద్ధావాకర్ ను(Shraddha murder case) చంపి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో ఉంచి అడవిలో పారవేశాడు.మృతదేహం భాగాలను పారవేయడానికి ప్రసిద్ధ క్రైమ్ షోల నుంచి సమాచారం సేకరించాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తన ప్రియురాలి మృతదేహాన్ని ముక్కలు చేసే ముందు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని కూడా తాను చదివినట్లు ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు.

Updated Date - 2023-01-10T12:06:09+05:30 IST