Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం...భక్తుల పూజలు
ABN , First Publish Date - 2023-04-25T11:02:22+05:30 IST
మంచుతుపాన్ తగ్గడంతో కేదార్‌నాథ్ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు....
రుద్రప్రయాగ్(ఉత్తరాఖండ్): మంచుతుపాన్ తగ్గడంతో కేదార్‌నాథ్ దేవాలయం భక్తుల సందర్శన కోసం మంగళవారం తలుపులు తెరిచారు.(Kedarnath)మంగళవారం ఉదయం 6.20 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల కోసం తెరిచామని శ్రీ బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ చెప్పారు. కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌ను ఆలయ ప్రధాన పూజారి జగద్గురు రావల్ భీమా శంకర్ లింగ్ శివాచార్య ప్రారంభించారు.(open to pilgrims)ఆలయాన్ని 35 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. బాబా కేదార్ పంచముఖి చల్ విగ్రహ డోలీ కూడా సోమవారం ధామ్‌కు చేరుకుంది.
ఇది కూడా చదవండి : Yogi Adityanath: యూపీ సీఎం యోగిని చంపుతాను...టోల్ ఫ్రీ నంబరుకు ఆగంతకుడి ఫోన్ కాల్
కేదార్‌నాథ్‌లో అడపాదడపా మంచు కురుస్తున్న దృష్ట్యా యాత్రను ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు.యాత్రికుల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సాయంత్రం గుప్తకాశీ చేరుకున్నారు. రాష్ట్రంలో చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, భగవంతుని దయ వల్ల గతేడాది కంటే ఈ ఏడాది యాత్రకు భక్తులు అధికంగా వస్తారని సీఎం సింగ్ తెలిపారు.యాత్రికుల రక్షణ కోసం పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు.