Driving licenses: ఒకే రోజు 900 మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు

ABN , First Publish Date - 2023-01-13T12:54:30+05:30 IST

అధికంగా పని చేసి ప్రశంసలు అందుకున్నామనుకున్నారో... రికార్డులు బద్దలు కొట్టాలనుకున్నారో... లేక మరేదేదైనా ఆశించి ఆ పని

Driving licenses: ఒకే రోజు 900 మందికి డ్రైవింగ్‌ లైసెన్సులు

- సహాయ రవాణాధికారిపై సస్పెన్షన్‌ వేటు

బెంగళూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అధికంగా పని చేసి ప్రశంసలు అందుకున్నామనుకున్నారో... రికార్డులు బద్దలు కొట్టాలనుకున్నారో... లేక మరేదేదైనా ఆశించి ఆ పని చేశారో తెలియదు కానీ.. ఆ ప్రభుత్వ అధికారి భారీగా పని చేసి బుక్కయి పోయారు. సాదారణంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving license) పొందాలంటే చుక్కలు చూపి స్తారు. ఉత్తరమో..దక్షిణమో సమర్పిస్తే కానీ లైసెన్స్‌ చేతిలోకి రాదు. రోజుకు 50 నుంచి 80మందికి దాకా డ్రైవింగ్‌ లైసెన్సులను మంజూరు చేస్తారు. అందుకు అనుగుణంగానే దరఖాస్తుదారులకు తేదీలను ముందుగానే ఖరారు చేస్తారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల మంజూరుతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున రోజువారి కొందరికి మాత్రమే అవకాశం ఇస్తారు. కానీ బెంగళూరు ఎలక్ర్టానిక్‌ సిటీ ప్రాంతీయ రవాణాశాఖాధికారి కార్యాలయంలో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ 2022 డిసెంబరులో ఒక రోజు ఏకంగా 900 మందికి లైసెన్సులను మంజూరు చేయడం సర్వత్రా విమర్శలకు కారణమైంది. ఎలకా్ట్రనిక్‌ సిటీ ప్రాంతీయ రవాణాశాఖాధికారి కార్యాలయంలో ముగ్గురు బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌లు ఉన్నారు. గరిష్టంగా అధికారులు పనిచేస్తే రోజుకు ఒక అధికారి వందకు మించి ఇవ్వడం సాధ్యం కాదు. కానీ డ్రైవింగ్‌ లైసెన్సుల విభాగానికి చెందిన కృష్ణానంద ఒకే రోజున ఏకంగా 900 మందికి డీఎల్‌లు మంజూరు చేసిన విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈమేరకు ఉన్నఫళంగా పరిశీలన జరిపిన ప్రాంతీయ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ సిద్దరామప్ప తనిఖీలు చేసి సంబంధిత బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై బుధవారం సస్పెన్షన్‌ వేటు వేశారు. కనీసం దరఖాస్తులు చూడకుండానే ప్రక్రియ సాగించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు కమిషనర్‌ తెలిపారు. అయితే వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సమయంలో లైస్‌న్సెలు ఇష్టానుసారంగా జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-01-13T12:54:33+05:30 IST