Earthquake: అసోంలో మళ్లీ భూకంపం...భయాందోళనల్లో జనం
ABN , First Publish Date - 2023-03-08T09:56:46+05:30 IST
అసోం రాష్ట్రంలో బుధవారం మళ్లీ భూకంపం సంభవించింది....
కాంరూప్ (అసోం): అసోం రాష్ట్రంలో బుధవారం మళ్లీ భూకంపం సంభవించింది.(Earthquake) కాంరూప్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.(Assam's Kamrup district) కాంరూప్ జిల్లాలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 3.59 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల నిద్రపోతున్న జనం తీవ్ర భయాందోళనలు చెందారు.
ఇది కూడా చదవండి : Priyanka Gandhi: ప్రియాంకగాంధీ పీఏపై బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్ కేసు
ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ జిల్లాలో గత నెల 28వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. గత నెల 19వతేదీన అరుణాచల్ ప్రదేశ్ లోనూ భూకంపం సంభవించింది.