సీఎంఎస్ సెక్యూరిటీస్‌లో రూ.7 కోట్ల దోపిడీ
ABN , First Publish Date - 2023-06-11T02:52:55+05:30 IST
బ్యాంకులు, ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్ సెక్యూరిటీస్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది.
లుధియానా (పంజాబ్), జూన్ 10: బ్యాంకులు, ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్ సెక్యూరిటీస్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సుమారు పది మంది సాయుధ దుండగులు ఇక్కడి న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలోని ఆ సంస్థ కార్యాలయంలోకి చొరబడి దాదాపు రూ.7కోట్లు ఎత్తుకెళ్లారు. కచ్చితంగా ఎంత పోయిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. నగదు రవాణా కోసం అక్కడ ఉంచిన కంపెనీ క్యాష్ వ్యాన్‌లోనే పరారు కావడం గమనార్హం. దుండగులు సీసీటీవీ కెమేరాల వీడియో రికార్డర్లను కూడా తీసుకెళ్లారు.