Share News

Medical Rocket: ఫేక్ సర్టిఫికేట్లతో సర్జరీలు.. ఇద్దర్ని బలిగొన్న నిందితులు.. ఢిల్లీ మెడికల్ రాకెట్లో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-11-16T15:03:07+05:30 IST

Doctors: ఫేక్ సర్టిఫికేట్లు ఉపయోగించి శస్త్ర చికిత్స చేసిన ముఠా ఇద్దరి ప్రాణాలను బలికొంది. ఈ ఘటనలో పోలీసులు తాజాగా పలువురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనలో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి.

Medical Rocket: ఫేక్ సర్టిఫికేట్లతో సర్జరీలు.. ఇద్దర్ని బలిగొన్న నిందితులు.. ఢిల్లీ మెడికల్ రాకెట్లో సంచలన విషయాలు

ఢిల్లీ: ఫేక్ సర్టిఫికేట్లు ఉపయోగించి శస్త్ర చికిత్స చేసిన ముఠా ఇద్దరి ప్రాణాలను బలికొంది. ఈ ఘటనలో పోలీసులు తాజాగా పలువురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనలో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ కైలాష్ లోని ఓ క్లినిక్ లో శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు ఇటీవల మృతి చెందారు.

ఫేక్ డాక్టర్లు తమ వారిని హత్య చేశారని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

ఇద్దరు వైద్యులుగా, ఒక మహిళ సర్జన్‌గా, మరొకరు ల్యాబ్ టెక్నిషియన్‌గా చలామణి అవుతూ.. వైద్యం చేస్తున్నారు. 2022లో అస్గర్ అలీ అనే రోగి 2022లో శస్త్ర చికిత్స(Surgery) కోసం క్లినిక్ లో చేరాడు.

అతనికి డా.జస్ప్రీత్ సర్జరీ చేయాల్సి ఉండగా.. జస్ప్రీత్ స్థానంలో పూజ, మహేంద్ర సర్జరీ చేశారు. సర్జరీ పూర్తయ్యాక అలీకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఆయన్ని వెంటనే సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు.


అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ అగర్వాల్, మరో ముగ్గురు ఫేక్ వైద్యులు అలీకి శస్త్రచికిత్స చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. అగర్వాల్ ఒక ఫేక్ డాక్టర్ అని.. ఇలా ఎంతో మందికి చికిత్స చేసి హింసించనట్లు తమ రిపోర్ట్ లో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

2016 నుండి వీరిపై 7 ఫిర్యాదులు ఉన్నాయి. డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు అగర్వాల్ మెడికల్ సెంటర్‌పై కనీసం తొమ్మిది ఫిర్యాదులు వచ్చాయని కేసు దర్యాప్తులో తేలింది. ఇందులోని ఏడు కేసుల్లో ఫేక్ డాక్టర్ల(Fake Doctors) చికిత్సతో రోగులు మరణించారు. "నవంబర్ 1 న, నలుగురు వైద్యులను క్లినిక్ ని పరిశీలించడానికి పంపించాం. ఫేక్ ధ్రువపత్రాలు పెట్టి నకిలీ డాక్టర్లుగా వారు చలామణి అవుతున్నట్లు తేలింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) చందన్ చౌదరి పేర్కొన్నారు.

వైద్యుల సంతకాలు ఉన్న 414 ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లినిక్‌లో నిర్వహించే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) ప్రక్రియల కోసం రోగుల వివరాలను కలిగి ఉన్న రెండు రిజిస్టర్లు, అనేక నిషేధిత మందులు, ఇంజెక్షన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ నివాసం, క్లినిక్ నుండి గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్‌లు, రోగుల ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, 47 బ్యాంకుల చెక్‌బుక్‌లు, వివిధ బ్యాంకులకు చెందిన 54 ATM కార్డులు తదితర వస్తువులను స్వాధీనపరచుకున్నట్లు వారు వెల్లడించారు.

Updated Date - 2023-11-16T15:03:08+05:30 IST