Share News

చెన్నైను వీడని వరద

ABN , First Publish Date - 2023-12-06T02:32:15+05:30 IST

‘మిచౌంగ్‌’ తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన చెన్నై నగరం.. ఇంకా వరదనీటిలోనే నానుతోంది. ప్రధాన వీధులు సైతం వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

చెన్నైను వీడని వరద

చెన్నై, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘మిచౌంగ్‌’ తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన చెన్నై నగరం.. ఇంకా వరదనీటిలోనే నానుతోంది. ప్రధాన వీధులు సైతం వరద నీటిలో తేలియాడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని సబర్బన్‌ రైళ్లతో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సైతం కదలలేదు. వరదనీటి కారణంగా బయటి ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడంతో నగరంలో పాల కొరత ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పునరావాస శిబిరాలను సీఎం స్టాలిన్‌ పరిశీలించి బాధితులను పరామర్శించారు. వారికి దుప్పట్లు, చాప వంటి వాటిని పంపిణీ చేశారు.

Updated Date - 2023-12-06T02:32:15+05:30 IST