NTR: ఎన్టీఆర్ సీఎంగా పట్టాభిషేకానికి నేటికి 40 ఏళ్లు

ABN , First Publish Date - 2023-01-09T10:43:45+05:30 IST

నందమూరి తారక రామారావు అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగానే కాదు రాజకీయాల్లోనూ పలు సంచలనాలు సృష్టించిన వ్యక్తిగా తెలుగునాట చరిత్ర పుటల్లో...

NTR: ఎన్టీఆర్ సీఎంగా పట్టాభిషేకానికి నేటికి 40 ఏళ్లు
Forty Years Ago NTR is Chief Minister

హైదరాబాద్ : నందమూరి తారక రామారావు అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగానే కాదు రాజకీయాల్లోనూ పలు సంచలనాలు సృష్టించిన వ్యక్తిగా తెలుగునాట చరిత్ర పుటల్లో నిలిచారు.‘(Telugu Desam president N T Rama Rao) 1983వ సంవత్సరం జనవరి 9వతేదీన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ టి రామారావు ప్రమాణ స్వీకారం చేశారు.(NTR is Chief Minister) సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే దశాబ్దాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సోమవారానికి 40 ఏళ్లు నిండాయి. ఎన్టీఆర్ చైతన్య రథమెక్కి ఊరు వాడా తిరిగి తెలుగుదేశం పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చి ప్రభంజనం సృష్టించారు.

ఎన్టీఆర్ నాడు ముఖ్యమంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయకుండా హైదరాబాద్ నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల మధ్య అచ్చతెలుగులో ప్రమాణస్వీకారం చేసి కొత్త చరిత్రకు నాంది పలికారు.ఎన్టీఆర్ సీఎం అయ్యాక పరిపాలనలో పలు సంస్కరణలు తీసుకువచ్చి ప్రజాభిమానాన్ని పొందారు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంతో తెలుగునాట ప్రజల్లో రాజకీయ చైతన్యం పెల్లుబుకింది.నాడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం, పేదలకు జనతా వస్త్రాల పంపిణీ లాంటి వినూత్న పథకాలతో ఎన్టీఆర్ ప్రజలకు చేరువ అయ్యారు.

Updated Date - 2023-01-09T11:04:59+05:30 IST