G20 Summit: జీ20 పేరు మారనుందా? ఇకపై జీ21 అని పిలవనున్నారా? ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-09-08T17:55:48+05:30 IST

జీ20 కూటమిలో మరో యూనియన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌(AU)కు సభ్యత్వం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ చేరిక తర్వాత జీ20 పేరు మారుతుందని టాక్ నడుస్తోంది.

G20 Summit: జీ20 పేరు మారనుందా? ఇకపై జీ21 అని పిలవనున్నారా? ఎందుకంటే..?

జీ20 కూటమిలో మరో యూనియన్‌కు సభ్యత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఆఫ్రికన్ యూనియన్‌(AU)కు సభ్యత్వం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఢిల్లీ వేదికగా ఈనెల 9,10 తేదీల్లో జరిగే జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ యూనియన్ చేరిక తర్వాత జీ20 పేరు మారుతుందని టాక్ నడుస్తోంది. జీ20 పేరును ఇకపై జీ21గా మార్చనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్నిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆఫ్రికా యూనియన్‌లో 55 దేశాలు ఉన్నాయి.

ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశానికి సంబంధించిన అంశం ఇప్పటికే జీ20 నివేదికలో చేర్చినట్లు తెలుస్తోంది. జూలైలో రష్యా-ఆఫ్రికా సమ్మిట్ సందర్భంగా AU అభ్యర్థిత్వానికి G20 సమ్మిట్‌కు గైర్హాజరు అవుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు ఇచ్చారని సమాచారం అందుతోంది. జీ20లో ప్రస్తుతం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (EU) ఉన్నాయి. ఆయా దేశాలు కూడా జీ20లో AUని చేర్చే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. AU అంగీకారం తెలిపితే 27 మంది సభ్యుల EU అదే హోదాను కలిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే AU చేరిక తర్వాత G20 పేరులో మార్పు వస్తుందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: India-Bharat : ఇండియా, భారత్ పేరు వివాదం.. రాహుల్ గాంధీ ఘాటు స్పందన..

ఢిల్లీ వేదికగా జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి అందులో భాగమైన ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, UK వంటి EU రాష్ట్రాల నాయకులు ఈజిప్ట్, నైజీరియా, దక్షిణాఫ్రికా, మారిషస్, కొమొరోస్‌తో సహా ఈ సమావేశానికి హాజరయ్యే AU రాష్ట్రాల నాయకులతో సెప్టెంబర్ 9న సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ గ్లోబల్ సౌత్‌ కోసం EU విస్తరణలో భాగంగా ఉంటుందని సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రపంచ GDPలో 85%, ప్రపంచ వాణిజ్యంలో 75% కంటే ఎక్కువ ఉన్న దేశాల ప్రతినిధులు జీ20 ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో AU చేరిక వాతావరణ పరివర్తన, స్థిరమైన అభివృద్ధి వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఆఫ్రికన్ దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పలువురు భావిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది జూన్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశంలో AUకి పూర్తి సభ్యత్వం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే జీ20 సభ్యులలోని తన సహచరులకు లేఖ రాశారు. AU నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

Updated Date - 2023-09-08T17:55:48+05:30 IST