వృద్ధుడిని స్కూటర్‌తో కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు

ABN , First Publish Date - 2023-01-18T03:23:47+05:30 IST

బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. వృద్ధుడిని స్కూటర్‌తో దాదాపు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వృద్ధుడిని స్కూటర్‌తో కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు

బెంగళూరులో అమానుషం.. నిందితుడి అరెస్టు

బెంగళూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో అమానుష ఘటన జరిగింది. వృద్ధుడిని స్కూటర్‌తో దాదాపు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్కూటర్‌ నడిపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముత్తప్ప(75) ప్రయాణిస్తున్న కారును మంగళవారం సుహేల్‌ నడుపుతున్న స్కూటర్‌ ఢీకొంది. ముత్తప్ప కారు దిగి సుహేల్‌ను ప్రశ్నించేందుకు యత్నించగా స్కూటర్‌ను వేగంగా పోనిచ్చాడు. దీంతో ముత్తప్ప స్కూటర్‌ను గట్టిగా పట్టుకోగా, దాదాపు కిలోమీటరు దూరం వరకు ఆయనను సుహేల్‌ స్కూటర్‌తో ఈడ్చుకెళ్లాడు. ముత్తప్పకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు సుహేల్‌ను మాగడి రోడ్డు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సుహేల్‌ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సుహేల్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-18T03:24:17+05:30 IST