Nepal : నేపాల్‌లో కూలిన హెలికాప్టర్
ABN , First Publish Date - 2023-07-11T12:55:41+05:30 IST
నేపాల్‌లోని సొలుఖుంబులో మంగళవారం హెలికాప్టర్ కూలిపోయింది. ఐదుగురు విదేశీయులు సహా ఆరుగురు దీనిలో ప్రయాణిస్తున్నారు. సొలుఖుంబు నుంచి ఖాట్మండు వెళ్తుండగా లమ్జుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 9ఎన్ఎంవీ కాల్ సైన్ గల ఈ హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాల్లోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలను కోల్పోయింది.
న్యూఢిల్లీ : నేపాల్‌లోని సొలుఖుంబులో మంగళవారం హెలికాప్టర్ కూలిపోయింది. ఐదుగురు విదేశీయులు సహా ఆరుగురు దీనిలో ప్రయాణిస్తున్నారు. సొలుఖుంబు నుంచి ఖాట్మండు వెళ్తుండగా లమ్జుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 9ఎన్ఎంవీ కాల్ సైన్ గల ఈ హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాల్లోనే కంట్రోల్ టవర్‌తో సంబంధాలను కోల్పోయింది.
నేపాలీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, మనంగ్ ఎయిర్‌కు చెందిన 9ఎన్ఎంవీ హెలికాప్టర్ మంగళవారం ఉదయం సొలుఖుంబులో బయల్దేరింది. ఖాట్మండుకు వెళ్తుండగా ఉదయం 10.15 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో సంబందాలను కోల్పోయింది. ఇది లమ్జుర ప్రాంతంలో కుప్పకూలింది. దీనిలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఐదుగురు మెక్సికన్లు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు. కోషీ ప్రావిన్స్ పోలీస్ డీఐజీ రాజేశ్‌నాథ్ బస్టోలా తెలిపిన వివరాల ప్రకారం, ఈ హెలికాప్టర్ శిథిలాలను లిఖు పీకే గ్రామ కౌన్సిల్ సరిహద్దుల్లో గుర్తించారు. ఐదు మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. ఈ హెలికాప్టర్‌ను కెప్టెన్ ఛేత్ బహదూర్ గురుంగ్ నడిపారు. ఆయన మనంగ్ ఎయిర్ సంస్థలో దాదాపు ఓ దశాబ్దం నుంచి పని చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Heavy Rains : ఉప్పొంగుతున్న యమున.. హిమాచల్ ప్రదేశ్‌కు వరద హెచ్చరిక..
India Vs America : అమెరికాను వెనుకకు నెట్టబోతున్న భారత్ : గోల్డ్‌మన్ శాచెస్