Himantha Biswa Sarma: భూపేష్ బఘేల్ దగ్గరికీ ఈడీ వస్తుంది. కానీ ఎప్పుడంటే? హిమంత స్ట్రాంగ్ వార్నింగ్
ABN , First Publish Date - 2023-11-15T15:48:48+05:30 IST
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీసుకున్నారన్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sarma) స్పందించారు. ఇప్పటికే చాలా మందిని ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న ఈడీ(Enforcement Directorate) సీఎంను కూడా అదుపులోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
రాయ్‌పుర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి రూ.508 కోట్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీసుకున్నారన్న ఆరోపణలపై అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sarma) స్పందించారు. ఇప్పటికే చాలా మందిని ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న ఈడీ(Enforcement Directorate) సీఎంను కూడా అదుపులోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. "భూపేష్ బఘేల్(Bhupesh Baghel) ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈడీ సమయం ఇచ్చింది.
కానీ ఎన్నికల తరువాత ఈడీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యమంత్రిని బెట్టింగ్ స్కాంలో విచారిస్తుంది. బఘేల్‌కు తాను జైలుకు వెళ్తానని తెలుసు. తనతో పాటు మరో 10 మందిని తీసుకెళ్లాలనుకుంటున్నారు.. ప్రస్తుతం ఈడీ ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉంది. ఈడీది పెద్ద మనసు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టైం ఇచ్చింది. బఘేల్ రూ.508 కోట్లను స్వీకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు చెప్పింది.
అయినప్పటికీ, వారు ఆయనకి ఇప్పటివరకు నోటీసులు జారీ చేయలేదు. దీంతో బఘేల్ ఈడీ(ED)కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు. వారు మరెవరికీ ఇలాంటి సదుపాయాన్ని కల్పించలేదు. లార్డ్ మహదేవ్ భూపేష్ ని విడిచిపెట్టరు" అని వార్నింగ్ ఇచ్చారు. మహాదేవ్ యాప్‌తో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని, అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బఘేల్ ఇటీవల విమర్శించారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల హోరుతో పాటు ‘మహాదేవ్ బెట్టింగ్ యాప్’ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు దొరికిన ఒక ‘కొరియర్’తో ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికల కోసం ఆ యాప్ నిర్వాహకుల నుంచి రూ.508 కోట్లు అందుకున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇది చినికి చినికి గాలివానగా మారుతూ.. బీజేపీ vs కాంగ్రెస్ గొడవగా అవతారమెత్తింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
తనపై ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఆరోపనలు వచ్చిన వెంటనే భూపేష్ బఘేల్ ఖండించారు. ఇదంతా బీజేపీ(BJP) వ్యూహమని మండిపడ్డారు. నిజానికి.. ఆ యాప్ నిర్వాహకులతో బీజేపీనే ఒప్పందం కుదుర్చుకుందని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో తాము గెలవలేమని బీజేపీకి స్పష్టమైందని, అందుకే ఈ కొత్త వివాదానికి తెరలేపిందని పేర్కొన్నారు. అసలు ఇంతవరకు ఆ యాప్‌ని ఎందుకు మూసివేయలేదని, దుబాయ్‌లో ఉన్న నిర్వాహకుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. అటు.. బీజేపీ మాత్రం అక్రమార్గంలో కాంగ్రెస్ ప్రజాధనాన్ని దోచుకుంటోందంటూ ఆరోపణలు చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రెండో దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.