హిందూజ గ్రూప్‌ చైర్మన్‌ ఎస్పీ హిందూజ మృతి

ABN , First Publish Date - 2023-05-18T03:27:25+05:30 IST

హిందూజ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీచంద్‌ పర్మానంద్‌ హిందూజ(87) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం లండన్‌లో తుది శ్వాస

హిందూజ గ్రూప్‌ చైర్మన్‌ ఎస్పీ హిందూజ మృతి

న్యూఢిల్లీ, మే 17: హిందూజ గ్రూప్‌ చైర్మన్‌ శ్రీచంద్‌ పర్మానంద్‌ హిందూజ(87) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం లండన్‌లో తుది శ్వాస విడిచారు. కాగా, స్వీడన్‌కు చెందిన ఆయుధ తయారీ కంపెనీ ఏబీ బోఫోర్స్‌కు భారత ప్రభుత్వ కాంట్రాక్టు లభించేలా చేసేందుకు ఎస్పీ హిందూజతో పాటు ఆయన సోదరులు గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌లు దాదాపు రూ.64 కోట్ల అక్రమంగా కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే 2005లో ఢిల్లీ హైకోర్టు వారిని నిర్ధోషులుగా ప్రకటించింది.

Updated Date - 2023-05-18T03:28:20+05:30 IST