Copy-paste CM: సీఎం సమాధానం వింటే నోరు వెళ్లబెట్టాల్సిందే...
ABN , First Publish Date - 2023-04-04T20:05:30+05:30 IST
''కాపీ-పేస్ట్ సీఎం'' అంటూ తనపై ట్రోల్ చేసిన ఓ వ్యక్తికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కళ్లు బైర్లు కమ్మే..
న్యూఢిల్లీ: ''కాపీ-పేస్ట్ సీఎం'' అంటూ తనపై ట్రోల్ చేసిన ఓ వ్యక్తికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Shara) కళ్లు బైర్లు కమ్మే సమాధానం ఇచ్చారు. మంగళవారంనాడు ఈ ఆసక్తి కరమైన ఘటన చోటుచేసుకుంది. శర్మ ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు విజిటర్స్ బుక్‌లో వివరాలు రాయాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన వేరే బుక్‌లోని సమాచారాన్ని ఆసరాగా తీసుకుని తదనుగుణంగా ఆ కాలమ్స్ పూర్తిచేశారు. రోషన్ రాయ్ అనే ట్రోలర్ అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ, కాపీ చేయకుండా విజిటర్స్ బుక్‌లో ఒక్క పేరా కూడా రాయలేరంటూ శర్మపై విమర్శలు గుప్పించారు.
సీఎం సమాధానమిదే...
ట్రోలర్ పోస్ట్‌కు ముఖ్యమంత్రి శర్మ వెంటనే అదిరిపోయే సమాధానం ఇచ్చారు. తాను అస్సామీస్ మీడియం స్కూలులో చదివానని, ఇంగ్లీషు, హిందీ వీలైనంత నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ఇంగ్లీషు, హిందీ తనకు అంత బాగా తెలియదనే విషయం ఒప్పుకుంటున్నాననీ, ఇందుకు తానేమీ బిడియపడటం లేదని సూటి సమాధానమిచ్చారు.