4 రకాల రొమ్ముక్యాన్సర్ జన్యువుల గుర్తింపు
ABN , First Publish Date - 2023-08-22T02:41:54+05:30 IST
రొమ్ము కేన్సర్‌కు సంబంధించి నాలుగు రకాల కొత్త జన్యువులను యూకేలోని కేంబ్రిడ్జి పరిశోధకులు, కెనడాలోని యూనివర్సిటే లావాల్ పరిశోధకులు సంయుక్త అధ్యయనంలో తాజాగా గుర్తించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: రొమ్ము కేన్సర్‌కు సంబంధించి నాలుగు రకాల కొత్త జన్యువులను యూకేలోని కేంబ్రిడ్జి పరిశోధకులు, కెనడాలోని యూనివర్సిటే లావాల్ పరిశోధకులు సంయుక్త అధ్యయనంలో తాజాగా గుర్తించారు. రొమ్ము కేన్సర్ ప్రమాదం పొంచి ఉన్న మహిళల్ని వీటి సాయంతో ముందుగానే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని వారు తమ నివేదికలో స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం రొమ్ము కేన్సర్‌కు జరుగుతున్న జన్యు పరీక్షల్లో బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2, పీఏఎల్‌బీ2 వంటి ఏవో కొన్ని జన్యువుల్ని మాత్రమే పరిగణిస్తున్నారు. మా అధ్యయనంలో భాగంగా ఆసియా, ఐరోపా దేశాల్లోని 26వేలమంది రొమ్ము కేన్సర్ బాధిత మహిళలు, 2.17లక్షలమంది ఆరోగ్యంగా ఉన్న మహిళల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించాం. కొత్తగా నాలుగు రకాల రొమ్ము కేన్సర్ జన్యువులను గుర్తించాం’’ అని పరిశోధకులు వివరించారు.