Coal mine Collapses: అక్రమ బొగ్గు గని కుప్పకూలి ముగ్గురి దుర్మరణం
ABN , First Publish Date - 2023-06-09T18:26:50+05:30 IST
జార్ఖాండ్‌లోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని కుప్పకూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. బీసీసీఎల్ ఓపెన్ మైన్‌లోని కొంతభాగం శుక్రవారం ఉదయం కుప్పకూలినట్టు ధన్‌బాద్ ఎస్ఎస్‌పీ సంజీవ్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందన్నారు.
ధన్‌బాద్: జార్ఖాండ్‌లోని ధన్‌బాద్‌లో అక్రమ బొగ్గు గని (Coal mine) కుప్పకూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. బీసీసీఎల్ (Bharat Coking Coal Limted) ఓపెన్ మైన్‌లోని కొంతభాగం శుక్రవారం ఉదయం కుప్పకూలినట్టు ధన్‌బాద్ ఎస్ఎస్‌పీ సంజీవ్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందని, బీసీసీఎల్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, ఈ బొగ్గు గని భోవ్రా ఏరియా కిందకు వస్తుందని, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోందని జోరాపోఖర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ బినోద్ ఒరయాన్ తెలిపారు. ఘటనపై దర్యప్తు జరుపుతున్నామని, మృతుల సంఖ్యను నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.