Independence day : ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2023-08-15T09:21:14+05:30 IST

ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని న‌రేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే... ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది.

Independence day : ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని న‌రేంద్ర మోదీ జెండా ఎగురవేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే... ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఆహ్వానం పంపారు. ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందిని పైగా ఆహ్వానించడం జరిగింది.

రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది, కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవరాల తవ్వకం, ఇంటింటికీ నీరు పథకంలో పాల్గొన్న కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎర్రకోట వద్ద రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి గిరిధర్ అరమానే తదితరులు స్వాగతం పలికారు.

ఢిల్లీ సంయుక్త ఇంటర్-సర్వీసెస్, ఢిల్లీ పోలీస్ గార్డ్ బలగాలు ప్రధానికి వందన సమర్పణ చేశాయి. అనంతరం సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ గౌరవ వందన కవాతు బృందంలో ఆర్మీ, వైమానిక దళం, ఢిల్లీ పోలీసు విభాగం నుంచి ఒక్కొక్క అధికారితో పాటు 25 మంది సిబ్బంది, నావికాదళం నుంచి ఒక అధికారితోపాటు 24 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది కవాతు సమన్వయ బాధ్యతను భారత సైన్యం నిర్వహించింది. మేజర్ వికాస్ సంగ్వాన్ నేతృత్వంలో సైనిక దళాలు కవాతు నిర్వహించాయి. ప్రధాని జాతీయ జెండాను పూల వర్షం కురిపించిన భారత వైమానిక దళానికి చెందిన మార్క్-III ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు ఆవిష్కరించాయి. ఎర్రకోట వద్ద పుష్పాలంకరణలో విశేషాకర్షణగా జి-20 లోగో నిలిచాయి. ఎర్రకోటకు చేరుకునే ముందు రాజ్ ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించాయి.

Updated Date - 2023-08-15T09:21:14+05:30 IST