భారతదేశపు మొదటి గ్రామం ‘మాణా’!
ABN , First Publish Date - 2023-04-26T02:48:26+05:30 IST
భారత్- చైనా సరిహద్దులో ఉత్తరాఖండ్‌లోని ‘మాణా’
డెహ్రాడూన్, ఏప్రిల్ 25: భారత్- చైనా సరిహద్దులో ఉత్తరాఖండ్‌లోని ‘మాణా’ గ్రామాన్ని భారత దేశపు మొదటి గ్రామంగా పేర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఆ గ్రామం ప్రవేశ ద్వారం వద్ద బోర్డును ఏర్పాటు చేసింది. ఇకపై మాణా గ్రామం దేశపు చివరి గ్రామం కాదని, మొదటి గ్రామమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ట్వీట్ చేశారు. గతేడాది ప్రధాని మోదీ చమోలీలో పర్యటించినప్పుడు సరిహద్దు గ్రామాలు దేశపు మొదటి గ్రామాలని, చివరి గ్రామాలు కాదని పేర్కొన్నారు.