Covid: 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు...10 రోజుల్లో కరోనా తగ్గుముఖం...వైద్యనిపుణుల అంచనా
ABN , First Publish Date - 2023-04-13T11:15:52+05:30 IST
దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది....
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో కేవలం 24 గంటల్లో 10,158 కొత్త కేసులు నమోదయ్యాయి.రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరుకుంది.8 నెలల్లో కరోనా కేసుల సంఖ్య అత్యధికమని వైద్యనిపుణులు చెప్పారు. రోజురోజుకు కరోనా కేసుల పెరుగుదలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.దేశంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి పెరిగింది. రాబోయే 10-12 రోజుల వరకు కరోనా కేసులు పెరుగుతూనే ఉండవచ్చని, అయితే ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని(Covid entering endemic stage) వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య తక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్రలో 1,000 తాజా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదలతో 10 లక్షల బెడ్లు, ఆక్సిజన్ తో 3 లక్షల బెడ్లు, 90,785 ఐసీయూ బెడ్స్, 54,040 ఐసీయూ కం వెంటిలేటర్స్ బెడ్స్ సిద్ధం చేశామని వైద్యాధికారులు చెప్పారు. ఒమైక్రాన్(Omicron) వేరియంట్ కరోనా రకం ప్రబలుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ సంవత్సరం కరోనా కేసుల్లో ఫిబ్రవరిలో 21.6 శాతం నుంచి మార్చిలో 35.8 శాతానికి పెరిగింది.
ఇది కూడా చదవండి : Gangster: గ్యాంగ్‌స్టర్ ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ...దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Health ministry) గణాంకాల ప్రకారం భారతదేశంలో బుధవారం ఒక్కరోజే 7,830 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది 223 రోజుల్లో అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యగా 668,432,658 పారాసెటమాల్ టాబ్లెట్లు, 97,170,149 డోస్‌ల అజిత్రోమైసిన్, ఇతర నిత్యావసరాలను కూడా నిల్వ చేసింది. మొత్తం 14,698 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, 4,557 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. దీనికి అదనంగా ప్రభుత్వం కొవిడ్ -19 చికిత్సపై దృష్టి సారించి, 208,386 మంది వైద్యులను సిద్ధం చేసింది.