Rajnath Singh: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

ABN , First Publish Date - 2023-10-01T17:13:33+05:30 IST

భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. త్రివిద దళాలు రక్షణ శాఖ ఆర్థిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

Rajnath Singh: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..

న్యూఢిల్లీ: భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే సాయుధ బలగాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. త్రివిద దళాలు రక్షణ శాఖ ఆర్థిక వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఆదివారంనాడు జరిగిన డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ (DAD) 276వ వార్షికోత్సవాల్లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. 'డాడ్' అంటే రక్షణ నిధుల సంరక్షుకుడని (గార్డియన్ ఆఫ్ డిఫెన్స్ ఫైనాన్స్) అని అభివర్ణించారు. ఏదైనా అనుమాస్పద కార్యక్రమాలను ముందుగానే గుర్తించేందుకు అంతర్గత నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, దీనివల్ల సమస్యను సత్వరం గుర్తించడమే కాకుండా, రక్షణ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కూడా పెరుగుతుందన్నారు.


"అభివృద్ధి చెందిన దేశంగా మనం అవతరించాలంటే మనం బలమైన సాయుధ బలగాలను అత్యాధునిక ఆయుధాలు, సామగ్రితో మరింత బలోపేతం చేసుకోవాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. సేవల డిమాండ్, అందుబాటులో ఉన్న వనరుల కేటాయింపులు మధ్య సమతూకం పాటించాలన్నారు. దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించే దిశగా డీఏడీ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. అపరమితమైన అవసరాలు, పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ స్ట్రాటజీతో ముందుకెళ్లాలని, ఇందుకోసం అంతర్గత పరిశోధనా బృందం ఏర్పాటు చేసుకోవాలని డీఏడీకి రాజ్‌నాథ్ సూచించారు.

Updated Date - 2023-10-01T17:13:38+05:30 IST