Share News

India aid to Nepal: నేపాల్ భూకంప బాధితులకు అత్యవసర సామాగ్రిని పంపిన భారత్

ABN , First Publish Date - 2023-11-05T21:04:59+05:30 IST

నేపాల్‌ను‌ 6.4 తీవ్రతతో పెను భూకంపం శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని ఆదివారంనాడు నేపాల్‌కు పంపింది.

India aid to Nepal: నేపాల్ భూకంప బాధితులకు అత్యవసర సామాగ్రిని పంపిన భారత్

న్యూఢిల్లీ: నేపాల్‌(Nepal)ను‌ 6.4 తీవ్రతతో పెను భూకంపం (Earthquake) శనివారంనాడు కుదిపేయడంతో భారతదేశం (India) తక్షణ ఆపన్నహస్తం అందించింది. వైద్య సామగ్రి, రిలీఫ్ మెటీరియల్, తదితరాలతో కూడిన ఎమర్జెన్సీ ఎయిడ్ ప్యాకేజీని (Emergency aid package) ఆదివారంనాడు నేపాల్‌కు పంపింది. నేపాల్‌ను కూదిపేసిన భూకంపంలో 157 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. నేపాల్‌ పిలుపునకు వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం రూ.10 కోట్లు విలువచేసే సహాయ సమగ్రిని ప్రత్యేక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్‌ ద్వారా నేపాల్‌కు పంపినట్టు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక అధికార ప్రకటనలో తెలిపింది.


టెంట్లు, టార్పాలిన్ షీట్లు, బ్లాంకెట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, ఔషధాలు, మెడికల్ సామగ్రి, పోర్టబుల్ వెంటిలేటర్స్ సహా 11 టన్నుల ఎమర్జెన్సీ సామాగ్రిని నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు భారత ప్రభుత్వం తరఫున అందజేశారు. నేపాల్ ఉప ప్రధాని, రక్షణ మంత్రి బహదూర్ ఖడ్కా తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. త్వరలోనే మరో విడత సహాయసామగ్రిని భారత్ పంపనుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ''నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ'' కింద ఈ సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ మత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. సంక్షోభ సమయంలో పొరుగుదేశాలకు సాయపడేందుకు భారతదేశం కట్టుబడి ఉందనడానికి ఇదొక ఉదాహరణ అని ఆయన ట్వీట్ చేశారు.

Updated Date - 2023-11-05T21:18:25+05:30 IST