Indian Railway:రైల్వేలో భారీగా ఉద్యోగాలంటూ నోటిఫికేషన్ వైరల్..అసలు నిజం వెల్లడించిన ఇండియన్ రైల్వేస్

ABN , First Publish Date - 2023-04-03T17:20:14+05:30 IST

ఇండియన్ రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో..

Indian Railway:రైల్వేలో భారీగా ఉద్యోగాలంటూ నోటిఫికేషన్ వైరల్..అసలు నిజం వెల్లడించిన ఇండియన్ రైల్వేస్

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ(The Ministry of Railways) శాఖ క్లారిటీ ఇచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force)లో ఎలాంటి నియామక నోటిఫికేషన్ (Recruitment Notificaton) ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే(Indian Railway)లో 20వేల కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. ఒకవేళ ఉద్యోగల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడంతోపాటు పత్రికా ప్రకటన చేస్తుందని పేర్కొంది.

కాగా ఈ ఏడాది ప్రారంభంలో రైల్వే జాబ్స్ స్కామ్ రాకెట్‌(Job Scam Racket )ను ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం(Delhi Police Economic Offences Wing) ఛేదించిన విషయం తెలిసిందే. ఓ ముఠా రైల్వే ఉద్యోగాల ఇప్పిస్తామంటూ తమిళనాడుకు చెందిన 28 మంది నుంచి రూన. 2.68 కోట్లు వసూలు చేసింది. ఈ ముఠాతో సంబంధమున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను తమిళనాడుకు చెందిన శివరామన్, ఢిల్లీలోని గోవింద్‌పురికి చెందిన వికాస్ రాణాగా గుర్తించారు.శివరామన్‌‌ను ఢిల్లీలోని మహదేవ్ మార్గ్‌లో అరెస్ట్ చేయగా, వికాస్ రాణాను డార్జిలింగ్‌లో అరెస్ట్ చేశారు.

నైరుతి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో నివాసముండే సత్యేందర్ డుబేను ఈ ముఠాకు నాయకుడిగా గుర్తించారు. ఈ ముఠాకు చెందిన మరో నిందితుడు రాహుల్ చౌదరిని తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. వికాస్ రాణా ఢిల్లీలోని ఉత్తర రైల్వే కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్‌గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడేవాడని వెల్లడించారు.

అమయాకుల నుంచిడబ్బులు వసూలు చేసి శిక్షణలో పేరుతో ఢిల్లీలోని పలు రైల్వే స్టేషన్లతో బాధితులను నిల్చోబెడతారు. వచ్చి పోయే రైళ్లను లెక్కిస్తూ ఉండాలని ప్రతి రోజులు 8 గంటలు వివిధ ఫ్లాట్ ఫారమ్ వద్ద నిలబెడతారని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-03T17:22:23+05:30 IST