Share News

Israel Hamas Truce: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి.. 10 మంది బందీలను విడుదల చేస్తే..

ABN , First Publish Date - 2023-11-22T12:32:15+05:30 IST

హమాస్ చెరలో ఉన్న డజన్ల సంఖ్యలో బంధీలకు త్వరలోనే విముక్తి కలగనుంది. ఈ మేరకు పాలస్తీనా మిలిటెండ్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన వెలువడింది.

Israel Hamas Truce: హమాస్-ఇజ్రాయెల్ మధ్య సంధి.. 10 మంది బందీలను విడుదల చేస్తే..

జెరూసలేం: హమాస్ చెరలో ఉన్న డజన్ల సంఖ్యలో బంధీలకు త్వరలోనే విముక్తి కలగనుంది. ఈ మేరకు పాలస్తీనా మిలిటెండ్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన వెలువడింది. మంగళవారం రాత్రంతా చర్చించిన అనంతరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమ్యాన్ నెతహ్యాహు సారధ్యంలోని కేబినెట్ ఒప్పందానికి ఆమోద ముద్రవేసింది. ఇది అత్యంత సంక్లిష్ట నిర్ణయమే అయినప్పటికీ సరైన నిర్ణయమేనని కేబినెట్ మంత్రులు అభిప్రాయపడ్డట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. హమాస్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్, విదేశీయులతో సహా మొత్తం 50 మంది బందీలు విడుదల కానున్నారని వెల్లడించారు. ఈ జాబితాలో మహిళలు, పిల్లలు ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ నాలుగు రోజులపాటు హమాస్‌లో మిలిటరీ ఆపరేషన్లు నిలిపివేయనుంది.


హమాస్ విడుదల చేసే ప్రతి 10 మందికి 1 రోజున చొప్పున సంధి కాలం పెరుగుతుందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ‘మానవతా సంధి’ని స్వాగతిస్తున్నట్టు హమాస్ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ జైళ్ల నుంచి 150 మంది పాలస్తీనియన్లు విడుదల కానున్నారని పేర్కొంది. కాగా ఈ సంధిలో భాగంగా పూర్తిగా కాల్పుల విరమణ, దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇవ్వనుందని హమాస్‌తోపాటు మరో పాలస్తీనా గ్రూప్ ‘ఇస్లామిక్ జిహాద్’ గ్రూపు పేర్కొంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదమే ప్రధాన అవరోధంగా ఉంటూ వచ్చింది. ఈ ఒప్పందం కుదరడంలో ఖతార్ మధ్యవర్తి పాత్ర పోషించింది.

Updated Date - 2023-11-22T12:32:16+05:30 IST