Chandrayaan-3: మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. శివశక్తి పాయింట్ వద్ద రోవర్ చక్కర్లు

ABN , First Publish Date - 2023-08-26T17:55:18+05:30 IST

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినప్పటి నుంచి ఇస్రో సంస్థ ల్యాండర్ మాడ్యూల్ అక్కడ రికార్డ్ చేస్తున్న దృశ్యాల్ని ‘X’ ప్లాట్‌ఫామ్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా..

Chandrayaan-3: మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. శివశక్తి పాయింట్ వద్ద రోవర్ చక్కర్లు

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినప్పటి నుంచి.. ల్యాండర్ మాడ్యూల్ అక్కడ రికార్డ్ చేస్తున్న దృశ్యాల్ని ‘X’ ప్లాట్‌ఫామ్ (ట్విటర్) వేదికగా ఇస్రో సంస్థ షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మరో వీడియోని విడుదల చేసింది. ఇందులో.. ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ నేరుగా ముందుకెళ్లడాన్ని మనం గమనించవచ్చు. కొంత దూరం వెళ్లిన తర్వాత అది ఒక్కసారిగా ఆగి.. ఎడవైపుకి టర్న్ తీసుకుంది. ఈ వీడియోని ఇస్రో షేర్ చేస్తూ.. ‘‘ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై రహస్యాల్ని కనుగొనే తన పరిశోధనల్లో భాగంగా శివశక్తి పాయింట్ వద్ద చక్కర్లు కొడుతోంది’’ అని రాసుకొచ్చింది. అంతకుముందు కూడా.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అవ్వడం, దాన్నుంచి ప్రజ్ఞాన్ రోవర్ జారుకుంటూ బయటకు రావడం వంటి వీడియోల్ని ఇస్రో షేర్ చేసిన విషయం తెలిసిందే!


మరోవైపు.. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రాంతానికి ‘శివశక్తి’ పాయింట్ అనే పేరుని ప్రధాని నరేంద్రమోదీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అలాగే.. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:03 గంటలకు చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని ఉపరితలంపై కాలు మోపడంతో, ఆరోజుని (ఆగస్టు 23) జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పిలుస్తామని మోదీ పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయన మరోసారి ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు. తాను ఒక కొత్త రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నానని.. శరీరం, ఆత్మ మొత్తం ఆనందంలో మునిగిపోయే సందర్భాలు చాలా అరుదు అని చెప్పారు. తాను దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల్లో ఉన్నప్పటికీ.. తన మనస్సు పూర్తిగా ఇస్రో శాస్త్రవేత్తలపైనే ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావానికి, కష్టానికి, స్ఫూర్తికి తాను నమస్కరిస్తున్నానన్నారు.

Updated Date - 2023-08-26T17:55:18+05:30 IST