Chandrayaan-3: రోవర్ దిగడానికి ముందు ఏం జరిగిందో చూడండి.. ఇస్రో నుంచి ఈ రోజు రెండో వీడియో విడుదల

ABN , First Publish Date - 2023-08-25T17:23:48+05:30 IST

చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చంద్రుడిపై ల్యాండయిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ నుంచి బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి అందుతున్న సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం రెండో వీడియోను విడుదల చేసింది.

Chandrayaan-3: రోవర్ దిగడానికి ముందు ఏం జరిగిందో చూడండి.. ఇస్రో నుంచి ఈ రోజు రెండో వీడియో విడుదల

బెంగళూరు: చందమామ దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా చంద్రయాన్-3 (Chandrayaan-3) చరిత్ర నెలకొల్పింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలిచిన విషయం తెలిసింది. ఇస్రో సాధించిన ఈ అద్భుతానికి ప్రపంచమే జైకొట్టింది. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చంద్రుడిపై ల్యాండయిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ నుంచి బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి అందుతున్న సమాచారం ఆసక్తిని కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న ఇస్రో శుక్రవారం రెండో వీడియోను విడుదల చేసింది.


‘‘ ఒక 2-సెగ్మెంట్ ర్యాంప్ ద్వారా రోవర్ ప్రజ్ఞాన్ సులభంగా కిందికి కదిలివచ్చింది. ఒక సోలార్ ప్యానల్ ద్వారా రోవర్‌కి విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైంది.

ల్యాండర్ నుంచి రోవర్ దిగిరావడానికి ముందు ర్యాంప్, సోలార్ ప్యానల్ ఆ క్షణంలోనే ఈ విధంగా మోహరించాయి.

చంద్రయాన్-3లో అమర్చిన మొత్తం 26 యంత్రాంగాలను బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో(URSC) తయారుచేశారు’’ అని ఇస్రో ట్వీట్ చేసింది.

కాగా.. ప్రయోగం కోసం అమర్చిన యంత్రాంగాలు అద్భుతంగా పనిచేస్తున్న తీరు నిజంగా అద్భుతమనిపిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 4 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత కూడా 2-సెగ్మెంట్ ర్యాంప్, సోలార్ ప్యానల్ పనిచేసిన తీరుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు పనితీరుపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది.

Updated Date - 2023-08-25T17:32:55+05:30 IST