Chandrayaan-3: ఇస్రో శాస్త్రవేత్త కీలక ప్రకటన.. అదే జరిగితే జాబిల్లిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ రేపు లేనట్టే...
ABN , First Publish Date - 2023-08-22T12:19:23+05:30 IST
జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఒక్కరోజు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌కు (Chandrayaan-3) ఏదైనా ప్రతికూల పరిస్థితి కనిపిస్తే సాఫ్ట్ ల్యాండింగ్‌ను ఆగస్టు 27కు వాయిదా వేస్తామని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (Space applications centre ISRO) ప్రకటించింది.
అహ్మదాబాద్: జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఒక్కరోజు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌కు (Chandrayaan-3) ఏదైనా ప్రతికూల పరిస్థితి కనిపిస్తే సాఫ్ట్ ల్యాండింగ్‌ను ఆగస్టు 27కు వాయిదా వేస్తామని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (Space applications centre ISRO) ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులపై ల్యాండింగ్ నిర్ణయం ఆధారపడి ఉంటుందని స్పేష్ అప్లికేషన్స్ సెంటర్-ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. ఆగస్టు 23న చందమామపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌కు నిర్దేశించిన సమాయానికి 2 గంటల ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని నీలేష్ వివరించారు. ఒక వేళ ఏదైనా పరిస్థితి ప్రతికూలంగా ఉందని భావిస్తే ల్యాండింగ్ ఆగస్టు 27కు వాయిదాపడుతుందన్నారు. ఒకవేళ అంతా సజావుగా ఉండి పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23నే ల్యాండింగ్ ఉంటుందని తెలిపారు.
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌కి ఇస్రో చైర్మన్ ఫోన్..
జాబిల్లిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖా మంత్రి జితేంద్ర సింగ్‌కు ఇస్రో చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ ఎస్ సోమనాథ్ ఫోన్ చేశారు. చంద్రయాన్-3 ప్రస్తుత పరిస్థితి, సాఫ్ట్ ల్యాండింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వివరించారు. చంద్రయాన్-3 పనితీరును కూడా వివరించారు. అన్ని సిస్టమ్స్ కచ్చితంగా పనిచేస్తున్నాయని, అనూహ్య పరిస్థితులు ఏర్పడతాయని భావించడంలేదని ఈ సందర్భంగా దీమా వ్యక్తం చేశారు.