DDA Sports Complex: ఢిల్లీ వాసులకు మోదీ కానుక: లెఫ్టినెంట్ గవర్నర్
ABN , First Publish Date - 2023-08-18T20:52:02+05:30 IST
దేశరాజధానిలోని ద్వారక ప్రాంతంలో ఢిల్లీ డవలప్‌మెంట్ అథారిటీ స్పోర్ట్స్ అభివృద్ధి పరచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శుక్రవారంనాడు ప్రారంభించారు. ఇది ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అందమైన కానుక అని అన్నారు.
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని ద్వారక ప్రాంతంలో ఢిల్లీ డవలప్‌మెంట్ అథారిటీ (DDA) స్పోర్ట్స్ అభివృద్ధి పరచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ (Sports Complex)ను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinai Kumar Saxena) శుక్రవారంనాడు ప్రారంభించారు. ఇది ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అందమైన కానుక (Beautiful gift) అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 23 ఎకరాల్లో రూ.92 కోట్ల ఖర్చుతో ఈ సోర్ట్స్ కాంప్లెక్‌ను అభివృద్ధి పరిచినట్టు చెప్పారు.
డీడీఏ అభివృద్ధి పరిచిన ఈ క్రీడా కాంప్లెక్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎల్జీ సక్సేనా పేర్కొన్నారు. కాంప్లెక్ మెంబర్‌షిప్ ఫీజు తక్కువే కాబట్టి ఈ అవకాశాన్ని ద్వారక ప్రజలు ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. చాలాకాలంగా దీనిని నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు జి-20 సమ్మిట్‌కు ముస్తాబవుతోందని, భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలకు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్ వంటి క్రీడలకు అనువైన సౌకర్యాలతో రికార్డు టైమ్‌లో డీడీఏ ఈ నిర్మాణం పూర్తి చేసిందన్నారు. 23.13 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి పరిచిన ఈ క్లాంప్లెక్స్‌లో పలు క్రీడా సదుపాయాలతో పాటు ఒక యోగా హాలు కూడా ఏర్పాటు చేశారు.