Joshimath crisis: 'రోప్ వే' సేవలు నిలిపివేత
ABN , First Publish Date - 2023-01-14T18:56:33+05:30 IST
'మానవ తప్పదం'గా భావిస్తున్న జోషిమఠం సంక్షోభం ఉత్తరాంఖండ్‌లో మరింత ముదురుతోంది. చమోలీ ..
జోషిమఠ్: 'మానవ తప్పదం'గా భావిస్తున్న జోషిమఠం (Joshimath crisis) సంక్షోభం ఉత్తరాంఖండ్‌లో మరింత ముదురుతోంది. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ (Joshimath) నుంచి ఔలిని కలిపే రోప్‌వే (Ropeway) సేవలను శనివారం నుంచి నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ రోప్‌వే సేవలు నిలిపివేస్తున్నట్టు జిల్లా యంత్రాగం ప్రకటించింది. గత రెండు వారాలుగు వేలాది ఇళ్లు బీటలు వారిని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోప్‌వే ఆపరేషన్ మేనేజర్ దినేష్ భట్ తెలిపారు. రోప్‌వే ఫ్లాట్‌ఫాం సమీపంలో గత ఆర్థరాత్రి కొన్ని పగుళ్లు కూడా కనిపించినట్టు ఆయన చెప్పారు. ముందు జాగ్రత్తగానే రోప్‌వే సేవలు ఆపుచేసినట్టు తెలిపారు. జోషిమఠ్ నుంచి ఔలి వరకూ 4.15 కిలోమీటర్ల రోప్‌వే ఇదని, టవర్ నంబర్ 1 సమీపంలో పగుళ్లు కనిపించడంతో సేవలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు.