DY Chandrachud: పారదర్శకంగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియ: జస్టిస్ డీవై చంద్రచూడ్

ABN , First Publish Date - 2023-09-15T19:05:07+05:30 IST

ఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(Supreme Court Chief Justice) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఆబ్జెక్టివ్ పారామీటర్‌లను నిర్దేశిస్తామని జస్టిస్ చంద్రచూడ్(Justice Chandrachud) తెలిపారు. అర్హులను గుర్తించేందుకు ప్రణాళిక, పరిశోధన కేంద్రం ఇప్పటికే పనులు ప్రారంభించిందని వివరించారు.

DY Chandrachud: పారదర్శకంగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియ: జస్టిస్ డీవై చంద్రచూడ్

ఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(Supreme Court Chief Justice) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైకోర్టులు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఆబ్జెక్టివ్ పారామీటర్‌లను నిర్దేశిస్తామని జస్టిస్ చంద్రచూడ్(Justice Chandrachud) తెలిపారు. అర్హులను గుర్తించేందుకు ప్రణాళిక, పరిశోధన కేంద్రం ఇప్పటికే పనులు ప్రారంభించిందని వివరించారు. న్యాయమూర్తుల(Judges)పై అందుబాటులో ఉన్న డేటా, వారు వెలువరించే తీర్పుల ఆధారంగా మదింపు జరుగుతుందని వెల్లడించారు. కోర్టుల్లో నియామకాల కోసం ఆబ్జెక్టివ్ ప్రమాణాలతో ఒక పత్రాన్ని తయారుచేస్తామని, దేశంలోని టాప్ 50 మంది న్యాయమూర్తులను ఉన్నత న్యాయస్థానంలో నియమించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


మూడు దశాబ్దాల నాటి కొలీజియం(Collegium) వ్యవస్థ పారదర్శకంగా, జవాబుదారీగా లేదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు(High Court)ల్లో న్యాయమూర్తుల నియామకాల వ్యవస్థ సరిగ్గా లేదన్న మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కొలీజియాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా లేదని ఆయన గతంలో అన్నారు. కొలీజియం వ్యవస్థ లో మార్పు రావాలంటే ప్రస్తుత వ్యవస్థలో మన మార్గంలో పని చేయడమే పరిష్కారమని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-15T19:05:33+05:30 IST