ముస్లిం ఉపముఖ్యమంత్రి కావాలి
ABN , First Publish Date - 2023-05-17T01:22:30+05:30 IST
ముస్లింలకు ఉపముఖ్యమంత్రితోపాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని కర్ణాటక వక్ఫ్‌బోర్డు చీఫ్ షఫీ సాది డిమాండ్ చేశారు.
కర్ణాటక వక్ఫ్ బోర్డు చీఫ్ సాది డిమాండ్
న్యూఢిల్లీ/బెంగళూరు, మే 16(ఆంధ్రజ్యోతి): ముస్లింలకు ఉపముఖ్యమంత్రితోపాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని కర్ణాటక వక్ఫ్‌బోర్డు చీఫ్ షఫీ సాది డిమాండ్ చేశారు. ‘ఎన్నికల ముందు కూడా మా డిమాండ్ ఇదే. రాష్ట్రంలో 90 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. మేం కోరినట్టు 30 సీట్లు మాకు ఇవ్వలేదు. కనీసం ఐదు మంత్రి పదవులన్నా ఇవ్వాలని అడుగుతున్నాం. దాంతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కోరుతున్నాం. హోం, రెవెన్యూ, ఆరోగ్యశాఖ వంటి కీలకమైన పోర్టుఫోలియోలు అడుగుతున్నాం’ అని మంగళవారం ఓ ప్రకటనలో సాది పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ తరహా లౌకికవాదానికి ఇదీ మూల్యం’ అంటూ సాది డిమాండ్‌పై బీజేపీ విరుచుకుపడింది.