Letters: రక్తంతో సీఎంకు లేఖలు

ABN , First Publish Date - 2023-02-08T11:23:40+05:30 IST

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 23 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న స్థానిక వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆందోళనను మరింత

Letters: రక్తంతో సీఎంకు లేఖలు

- వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యార్థుల వినూత్న నిరసన

రాయచూరు(బెంగళూరు), ఫిబ్రవరి 7: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 23 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న స్థానిక వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. మంగళవారం కొనసాగిస్తున్న దీక్ష సందర్భంగా రక్తంతో ముఖ్యయంత్రి(Chief Minister)కి లేఖలు రాశారు. తమ డిమాండ్‌లను పరిష్కరించాలని 23 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందనం లేకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఇంజనీరింగ్‌ చేసిన వారికి ఆ శాఖ నియామకాల్లో 15 శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలో ప్రత్యేక వ్యవసాయ ఇంజనీరింగ్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇదే విషయాలను తమ వేళ్ల రక్తతో ముఖ్యమంత్రికి లేఖలుగా రాసి నిరసనలు తెలిపారు.

ఇదికూడా చదవండి: మెట్రో రైలు పట్టాలకు పగుళ్లు

Updated Date - 2023-02-08T11:23:42+05:30 IST