Share News

Madhya Pradesh Exit Polls 2023: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?

ABN , First Publish Date - 2023-11-30T17:19:01+05:30 IST

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఎన్నికలు ముగిశాయి. గతంలో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63% పోలింగ్ నమోదవ్వగా.. 2023లో 77.15% పోలింగ్ నమోదు అయ్యింది.

Madhya Pradesh Exit Polls 2023: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్.. ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ ఏది?

మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఎన్నికలు ముగిశాయి. గతంలో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63% పోలింగ్ నమోదవ్వగా.. 2023లో 77.15% పోలింగ్ నమోదు అయ్యింది. ఇక నవంబర్ 30వ తేదీన తెలంగాణలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఎన్నికల సర్వే లాంటిది. ఈ సర్వేని ఓటింగ్ రోజున వివిధ కంపెనీలు నిర్వహిస్తాయి. కంపెనీ బృందాలు వివిధ నియోజకవర్గాలకు వెళ్లి.. ఓటు వేసిన తర్వాత వ్యక్తులు ఎవరెవరికి ఓటు వేశారో అడిగి తెలుసుకుంటారు. ఈ డేటాను సేకరించి.. ఏ పార్టీ ఎన్ని సీట్లు పొందాయో అంచనా వేస్తారు. ఫలితంగా.. ఏ రాష్ట్రాల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అంచనాకు రావొచ్చు.

కాగా.. 2003 నుంచి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కేవలం 2018 ఎన్నికల్లో మాత్రమే గెలుపొందింది. అప్పటివరకూ బీజేపీనే అక్కడ అధికారంలో ఉంది. అయితే.. మార్చి 2020లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి BJPలో చేరి.. రాష్ట్రంలోని కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లోనూ రెండు పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది. తామే అధికారంలోకి తిరిగి వస్తామని బీజేపీ చెప్తుండగా.. మధ్యప్రదేశ్‌లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది తామేనని కాంగ్రెస్ గట్టిగా వాదిస్తోంది. మరి.. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం.

  • న్యూస్24 - చాణక్య

కాంగ్రెస్: 62-86

బీజేపీ: 139-163

ఎస్పీ: 0

ఇతరులు: 1-9

  • మేట్రిజ్ (Matrize)

బీజేపీ: 118-130

కాంగ్రెస్: 97-107

ఇతరులు: 0-2

  • పోల్‌స్ట్రాట్

కాంగ్రెస్: 111-121

బీజేపీ: 106-116

ఇతరులు: 0-6

  • జన్‌కీ బాత్

కాంగ్రెస్: 102-125

బీజేపీ: 100-123

బీఎస్పీ: 0

ఇతరులు: 5

  • దైనిక్ భాస్కర్

బీజేపీ: 95-115

కాంగ్రెస్: 105-120

బీఎస్పీ: 0

ఇతరులు: 0-15

  • ఇండియా టీవీ - సీఎన్ఎక్స్

బీజేపీ: 140-159

కాంగ్రెస్: 70-89

బీఎస్పీ: 0

ఇతరులు: 0-2

  • ఇండియా టుడే - ఆక్సిస్ మై ఇండియా

బీజేపీ: 140-162

కాంగ్రెస్: 68-90

బీఎస్పీ: 0-2

ఇతరులు: 0-1

  • టైమ్స్ నౌ - ఈటీజీ

బీజేపీ: 105-117

కాంగ్రెస్: 109-125

బీఎస్పీ: 0

ఇతరులు: 105

  • ఆజ్‌తక్ - ఆక్సిస్

బీజేపీ: 140-162

కాంగ్రెస్: 68-90

ఎస్పీ: 0

ఇతరులు: 0-3

Updated Date - 2023-11-30T19:56:01+05:30 IST