Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. నేడు సాహిల్ ఖాన్ సహా ముగ్గురు సిట్ ముందుకు
ABN , Publish Date - Dec 15 , 2023 | 10:34 AM
ఛత్తీస్ గఢ్‌లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో విచారణకు హాజరుకావాంటూ సిట్ నలుగురికి సమన్లు జారీ చేసింది. వారిలో నటుడు సాహిల్ ఖాన్(Sahilkhan) కూడా ఉన్నాడు.
ఢిల్లీ: ఛత్తీస్ గఢ్‌లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో విచారణకు హాజరుకావాంటూ సిట్ నలుగురికి సమన్లు జారీ చేసింది. వారిలో నటుడు సాహిల్ ఖాన్(Sahilkhan) కూడా ఉన్నాడు. బెట్టింగ్ యాప్ కేసులో మ్యాచ్ ఫిక్సింగ్, అక్రమ హవాలా, క్రిప్టో కరెన్సీ లావాదేవీలతో పాటు రూ.15వేల కోట్ల మోసం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమన్లు జారీ చేసే ముందు మహాదేవ్ బుక్ ఆన్‌లైన్ బెట్టింగ్ సిండికేట్‌లోని ఇద్దరు ప్రధాన నిందితులలో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రవి యాప్ ప్రమోటర్‌గా పని చేస్తున్నారు. ఈడీ ఆదేశాల మేరకు దుబాయి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతన్ని త్వరలో భారత్‌కు రప్పించనున్నారు.
రవికి సంబంధించిన మనీలాండరింగ్ కేసును ఈడీ విచారిస్తోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కిక్‌బ్యాక్ కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రవిని అరెస్టు చేసిన వెంటనే దుబాయి అధికారులు ఈ విషయాన్ని భారతీయ అధికారులకు తెలియజేశారు.
అక్టోబర్‌లో యూఏఈ(UAE)లో ఉన్న రవి, అక్రమ బెట్టింగ్ సిండికేట్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. రవి అరెస్ట్ కావడంతో చంద్రాకర్‌ని కూడా త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిలో సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్, వికాస్ ఛపారియా, చంద్ర భూషణ్ వర్మ, సతీష్ చంద్రకర్, అనిల్ దమ్మాని, సునీల్ దమ్మాని, విశాల్ అహుజా, ధీరజ్ అహూజాతో సహా 14 మంది నిందితులుగా ఉన్నారు.