Home » Enforcement Directorate
కాకినాడ సీ పోర్టులో వాటాలు కొట్టేసిన కేసులోని మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దృష్టి సారించింది.
సాహితీ ఇన్ఫ్రా మోసాలకు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్‌లో రెండుచోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.6.15 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు పెట్టారు.
భాగ్యనరంలో ఈడీ రైడ్స్ కలకలం రేపింది. నగర వ్యాప్తంగా 8 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. ఫైనాన్సియర్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు అధికారులు.
ఫార్ములా ఈ కారు రేసు కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు.. ఎఫ్ఐఆర్తోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.
ఐఏఎస్ అధికారి అమేయకుమార్పై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మహేశ్వరం మండలం నాగారంలో 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో అమేయకుమార్పై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు చెందిన రూ.5.34 కోట్ల మేరకు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్‌బోర్డుకు చెందిన భూమి చేతులు మారడంపై ఓ సంస్థతోపాటు నలుగురు వ్యక్తులకు భూదాన్ బోర్డు కార్యదర్శి నోటీసులు పంపారు.
గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్ పనిచేసిన కాలంలో భూ కుంభకోణాలు భారీగా జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం మండలం నాగారంలోని 42 ఎకరాల భూదాన భూముల అన్యాక్రాంతంపై నమోదైన కేసులో ఈడీ విచారణ జరుపుతుండగా.. మరికొన్ని భూముల అక్రమాలపై కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
అగ్రిగోల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది.