Mahua Moitra: మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు
ABN , First Publish Date - 2023-12-08T15:42:06+05:30 IST
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది.
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారనే (Cash for query) ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ (TMC) ఎంపీ మహువా మెయిత్రా (Mahua Moitra)పై బహిష్కరణ వేటు పడింది. పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభ ఆమోదించింది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ 500 పేజీల నివేదకలో ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. నివేదికను లోక్‌సభ ఆమోదించడంతో ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
నివేదికపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అధీర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తదితరులు మహువా మొయిత్రీని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు.
ఇది మీ పతనానికి నాంది: మొయిత్రా
లోక్‌సభ నుంచి తనను బహిష్కరించడంపై మహువా మొయిత్రా పార్లమెంటు వెలుపల నిప్పులు చెరిగారు. బహిష్కరించే హక్కు ఎథిక్స్ కమిటీకి లేదని అన్నారు. ఇది మీ (బీజేపీ) ముగింపునకు ఆరంభం అంటూ ఘాటుగా విమర్శించారు.