Home » TMC
భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యసభలో మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్‌షా మాట్లాడుతూ, అంబేడ్కర్ పేరు పదేపదే ప్రస్తావించడం విపక్షనేతలకు ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని అన్నారు.
ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్నలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.
ఇప్పటిరవకు ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా.. తాజాగా మమతా బెనర్జీ తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండియా కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా అడ్డకట్ట వేయలేకపోయినప్పటికీ.. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకుండా ..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు.
ఉపఎన్నికల పోలింగ్ క్రమంలో పశ్చిమబెంగాల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లా జగత్దాల్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తులు టీఎంసీ నేతను కాల్చిచంపారు. అతనిని జగత్దాల్ 12వ నెంబర్ వార్డు టీఎంసీ మాజీ అధ్యక్షుడుగా పోలీసులు గుర్తించారు.
వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశంలో వాదన ప్రారంభించిన వారిని మందలించకుండా తనను మందలించడంతో తనకు కోపం వచ్చిందని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. ఆ కోపంలోనే బాటిల్‌ను పగులగొట్టానని, తన చేతి వేళ్లకు గాయలయ్యాయని చెప్పారు.
కమిటీ ప్రొసీడింగ్స్ గురించి కానీ, చర్చించిన అంశాల గురించి తాను బయటకు వెల్లడించడం లేదని, కమిటీ సమావేశంలో ఒక సభ్యుడు హింసాత్మక చర్చలకు పాల్పడటం, అందుకు ఆయనను సస్పెండ్ చేయడం గురించే తాను స్టేట్మెంట్ ఇచ్చానని జగదాంబికా పాల్ వివరణ ఇచ్చారు. పార్లమెంటరీ నిబంధనలు, సభా గౌరవం పట్ల తనకు విశ్వాసం ఉందన్నారు.
వక్ఫ్ (సవరణ) బిల్లు-2024పై బీజేపీ నేత జగదాంబిక పాల్ అధ్యక్షతన పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్‌లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఒడిశా-కటక్‌కు చెందిన జస్టిస్ ఇన్ రియాలిటీ, పంచశాఖ ప్రచార్ ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించేందుకు కమిటీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది.
వందేభారత్ రైలు కాంట్రాక్టుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. అయితే కొద్దిసేపటికే రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి కౌంటర్ ఇచ్చింది.