Share News

Manipur gunfight: మిలిటెంట్ గ్రూపుల మధ్య కాల్పులు..13 మంది మృతి

ABN , First Publish Date - 2023-12-04T19:04:35+05:30 IST

మణిపూర్‌ లోని తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగి ఈ కాల్పుల్లో 13 మంది మరణించారు.

Manipur gunfight: మిలిటెంట్ గ్రూపుల మధ్య కాల్పులు..13 మంది మృతి

ఇంఫాల్: మణిపూర్‌ (Manipur)లోని తేంగనౌపల్ జిల్లాలో రెండు మిలిటెంట్ గ్రూపుల (millitants group) మధ్య ఎదురెదురు కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. లెయితు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగి ఈ కాల్పుల్లో 13 మంది మరణించారు. ఒక మిలిటెంట్ల గ్రూపు మయన్మార్ వెళ్తుండగా ఆ ప్రాంతంలో ఆధిపత్యం ఉన్న మరో మిలిటెంట్ గ్రూప్ వారిపై దాడి చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకుని 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని స్థానికులుగా అనుమానిస్తున్నప్పటికీ ఇంకా గుర్తించాల్సి ఉంది.


మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుపై నిషేధం ఎత్తివేత

కాగా, హింసాత్మక సంఘటనలతో అట్టుడికిన మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులపై ఏడు నెలల క్రితం విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు ఎత్తివేసింది. డిసెంబర్ 18వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుంది. అయితే, సరిహద్దు ప్రాంతంలోని 9 జిల్లాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది.

Updated Date - 2023-12-04T19:04:37+05:30 IST