Manipur violence: మణిపూర్‌లో ఆగని హింస...రెండు వాహనాలకు నిప్పు
ABN , First Publish Date - 2023-07-08T14:15:28+05:30 IST
మణిపూర్ లో రెండు నెలల క్రితం చెలరేగిన హింసాకాండ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో 150 నుంచి 200 మంది అల్లరిమూక రెచ్చిపోయి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ చెదురుమదురు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనల్లో ఎవరైనా మృతి చెందారా అనేది వెంటనే తెలియలేదు
ఇంఫాల్: మణిపూర్ (Manipur)లో రెండు నెలల క్రితం చెలరేగిన హింసాకాండ ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో 150 నుంచి 200 మంది అల్లరిమూక రెచ్చిపోయి రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. శుక్రవారం అర్థరాత్రి వరకూ చెదురుమదురు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనల్లో ఎవరైనా మృతి చెందారా అనేది వెంటనే తెలియలేదు. హింసాకాండను అదుపు చేసేందుకు ఆర్మీ, అసోం రైఫిల్స్‌కు చెందిన రెండు కాలమ్‌ల భద్రతా సిబ్బంది సోంగ్డో గ్రామానికి శుక్రవారం రాత్రి హుటాహుటిన తరలించారు. బిష్ణుపూర్ మార్కెట్ ఏరియాకు అదనపు సరిహద్దు భద్రతా దళాలను పంపారు.
కాగా, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో శుక్రవారం రాత్రి చెదురుమదురు కాల్పుల ఘటనలు సైతం చోటుచేసుకున్నాయని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. షెడ్యుల్ కులాల హోదా కల్పించాలన్న మెయితీ తెగల డిమాండ్‌కు వ్యతిరేకంగా గత మే 3న గిరిజన సంఘీభావ ర్యాలీ జరగడం, అనంతరం క్రమంలో మెయితీ, కుకీ తెగల మధ్య హింసాకాడ చెలరేగి, అనేక జిల్లాల్లో విస్తరించడంతో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3,000 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు, సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు 40,000 సెక్యురిటీ సిబ్బందిని రాష్ట్రంలో మోహరించారు.