Share News

BJP Komal Manjhi: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోమల్ మాంఝీ హత్య.. కారణం ఇదే!

ABN , First Publish Date - 2023-12-09T22:23:30+05:30 IST

శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోమల్ మాంఝీని నక్సలైట్లు దారుణంగా హతమార్చారు. ఛోటెడోంగర్ గ్రామంలోని దేవి ఆలయంలో పూజలు ముగించుకున్న అనంతరం..

BJP Komal Manjhi: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోమల్ మాంఝీ హత్య.. కారణం ఇదే!

BJP Leader Komal Manjhi: శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోమల్ మాంఝీని నక్సలైట్లు దారుణంగా హతమార్చారు. ఛోటెడోంగర్ గ్రామంలోని దేవి ఆలయంలో పూజలు ముగించుకున్న అనంతరం మాంఝీ తిరిగి ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని నక్సలైట్లు ఆయనపై దాడి చేశారు. గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపేశారు. అనంతరం ఆ హంతకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మాంఝీకి గతంలోనే హత్య బెదిరింపులు రాగా.. ఇప్పుడు నక్సలైట్లు అన్నంత పని చేశారు.


ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. “గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని అంతర్గత ప్రాంతాల నుండి కొంతమందిని నారాయణపూర్ ప్రధాన కార్యాలయానికి తరలించి భద్రతలో ఉంచారు. వారిలో మాంఝీ, అతని మామ కూడా ఉన్నారు. రెండో దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరూ తమ గ్రామానికి తిరిగొచ్చారు. అయితే.. వాళ్లు భద్రత కోరేందుకు నిరాకరించారు’’ అని చెప్పారు. ఒకవేళ మాంఝీ భద్రతను నిరాకరించకుండా ఉండి.. బహుశా ఇప్పుడు బ్రతికే ఉండేవాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మాంఝీ హత్యకు గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మాంఝీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమ్దై వ్యాలీ ఇనుప ఖనిజం గనిలో మాంఝీ ఏజెంట్‌గా పనిచేసి భారీగా డబ్బు సంపాదించారని.. అందుకే ఆయన్ను హతమార్చినట్లు మావోయిస్టులు చేతితో రాసిన నోట్‌ని ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా.. గతంలో కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.

Updated Date - 2023-12-09T22:23:31+05:30 IST