Minister: 19 నుంచి ‘గృహలక్ష్మి’ దరఖాస్తుల స్వీకరణ

ABN , First Publish Date - 2023-07-16T10:47:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహలక్ష్మి గ్యారెంటీ పథకానికి ఈనెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి లక్ష్మీ

Minister: 19 నుంచి ‘గృహలక్ష్మి’ దరఖాస్తుల స్వీకరణ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహలక్ష్మి గ్యారెంటీ పథకానికి ఈనెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్‌(Minister Lakshmi Hebbalkar) తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణలకు తగిన ఏర్పా ట్లు చేశామని తెలిపారు. ఈనెల 17న కాంగ్రెస్‌ జాతీయ నాయకుల చేత యాప్‌ ప్రారంభిస్తామన్నారు. బ్యాంకుకు ఆధార్‌ అనుసంధానం కాకపోయినా దరఖాస్తు చేయవచ్చన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి యజమాని అయిన గృహిణి పథకానికి అర్హురాలు అన్నారు. గృహిణి లేదా భర్త ఆదాయపు పన్ను, జీఎస్‏టీ చెల్లించేవారు అయితే అర్హత ఉండదన్నారు. ఇప్పటికే రేషన్‌ కార్డులో యజమానిగా ఉండాలన్నారు. గ్రామ-1, బాపూజీ సేవాకేంద్ర, కర్ణాటక-1, బెంగళూరు-1 కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు టోల్‌ఫ్రీ నంబరు 1902 లేదా 8147500500కు వాట్సాప్‌ పంపవచ్చునని తెలిపారు. కాగా పథకానికి ఏడాదికి కనీసం రూ.30వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 16 నుంచి పంపిణీ చేస్తుండడంతో బడ్జెట్‌లో రూ.17,500 కోట్లు కేటాయించారు. గృహలక్ష్మి గ్యారెంటీ పథకాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ ద్వారా ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. బీజేపీయేతర పార్టీల ఐక్య కూటమి సదస్సులో పాల్గొనేందుకు సోనియాగాంధీ బెంగళూరుకు వస్తున్నారు. కానీ సోనియాగాంధీ నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు.

Updated Date - 2023-07-16T10:47:21+05:30 IST