Share News

Mizoram: ప్రారంభమైన మిజోరం ఎన్నికల కౌంటింగ్.. ప్రాంతీయ పార్టీలు మళ్లీ సత్తా చాటుతాయా?

ABN , First Publish Date - 2023-12-04T08:07:18+05:30 IST

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయిన ఒక రోజు తరువాత ఇవాళ ఉదయం 8 గంటలకు మిజోరం(Mizoram Assembly Elections 2023) రాష్ట్ర ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Mizoram: ప్రారంభమైన మిజోరం ఎన్నికల కౌంటింగ్.. ప్రాంతీయ పార్టీలు మళ్లీ సత్తా చాటుతాయా?

ఐజ్వల్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయిన ఒక రోజు తరువాత ఇవాళ ఉదయం 8 గంటలకు మిజోరం(Mizoram Assembly Elections 2023) రాష్ట్ర ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందస్తు ట్రెండ్ బట్టి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం సాధిస్తుందో తెలుస్తుంది.

ఈ ఎన్నికల్లో సీఎం జోరంతంగా(Zoramthanga) అధికార మిజో నేషనల్ ఫ్రంట్(MNF), లాల్దుహోమా నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూమెంట్(ZPM) ప్రాంతీయ పార్టీలుగా, కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలుగా తలపడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో గతంలో ఒకే సీటు గెలుచుకున్న బీజేపీ తన సత్తా చాటాలని చూస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇండియా టుడే యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్ మిజోరంలో ZPM క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసింది.


40 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ZPM 28–35 సీట్లు సాధించవచ్చిన అంచనా వేసింది. MNF 3–7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతగా ప్రభావం చూపబోదని..అది 2-4 సీట్లతో సరిపెట్టుకుంటుందని.. బీజేపీ 0-2 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగ్గా, మిగిలిన నాలుగు రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండింది. కానీ క్రైస్తవ-మెజారిటీ జనాభాకు ఆదివారం ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున భారత ఎన్నికల సంఘం (ECI) ఓట్ల లెక్కింపును ఇవాళ్టికి వాయిదా వేసింది.

2018లో ఎంఎన్‌ఎఫ్‌ 26 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది. ZPM ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 2013లో గెలిచిన 34 స్థానాలతో పోలిస్తే కేవలం ఐదు సీట్లతో సరిపెట్టుకుంది.

Updated Date - 2023-12-04T08:07:55+05:30 IST