Cabinet Decision: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2023-04-26T22:33:23+05:30 IST
కేంద్ర కేబినెట్ (Modi Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ (Modi Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. 1570 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా 157 మెడికల్ నర్సింగ్ కాలేజీలను (157 new nursing colleges) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ( Mansukh Mandaviya) చెప్పారు. రానున్న రెండేళ్లలో ఈ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ప్రతి ఏడాది కొత్తగా 15,700 నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కలగనుంది.
మెడికల్ పరికరాల రంగానికి సంబంధించి ఓ విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని మాండవీయ తెలిపారు.